శాతవాహన యూనివర్సిటీ ప్రధాన ప్రవేశం ముందు గల జ్యోతిబా ఫూలే కూడలి సుందరీకరణకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,సుడా వైస్ చైర్మన్,మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ బుధవారం సాయంత్రం 4గంటలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..15 లక్షలు సుడా నిధులతో సుందరీకరణ పనులు ఈ రోజు ప్రారంభించామని అన్నారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఫూలే విగ్రహం ఏర్పాటుకు మంజూరు ఇచ్చారని విగ్రహం చుట్టూ సుందరీకరణ చేసి గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు.కూడలి సుందరీకరణకు స్థానిక నాయకులు ఫూలే అభిమానులు ఎప్పటినుండో అడుగుచున్నారన్నారు.