కెపిహెచ్బి 4వ ఫేస్ లో జిహెచ్ఎంసి 4 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యంతో మందుబాబులకు అడ్డాలుగా మారిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి హాల్ లో పరిశీలించిన ఆయన నెల రోజుల్లో పునరుద్ధరించకపోతే జిహెచ్ఎంసి కార్యాలయాన్ని మూసేస్తామని హెచ్చరించారు. ప్రజా అవసరాల కోసం కడితే పట్టించుకోవడం లేదన్నారు.