గంట్యాడ మండలం కొండతామరాపల్లి జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట్యాడ మండలం దిగువ కొండపర్తి గిరిజన గ్రామ పంచాయతీ భీమవరం గిరిజన గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త కే రాజేశ్వరి కి తీవ్ర గాయాలయ్యాయి. గంజాడలో సమావేశాన్ని ముగించుకుని మోటార్ బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా కొండ తామరపల్లి జంక్షన్ సమీపంలో వాహనం అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలని గంట్యాడ 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు.