సూర్యాపేట జిల్లా: ఆత్మకూరు (ఏస్)మండలంలోని యూరియా కొరత కోసం రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని ఏపూరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. యూరియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సకాలంలో అందించకపోవడంతో రైతులను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు వాపోయారు.