పరిశుభ్రతపై బిచ్కుంద కస్తూరిబా సిబ్బందిని అభినందించిన సబ్ కలెక్టర్.... విద్యాలయాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిషెట్టి సూచించారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సబ్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాఠశాల సిబ్బందిని, ఉపాధ్యాయులను అభినందించారు.