పెడన ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. బొర్రపోతుపాలెం నుంచి పెట్రోల్ బంక్ వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు నాగార్జునను, గుడివాడ-ఏలూరు నుంచి మచిలీపట్నం వెళ్తున్న RTC బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నాగార్జునను స్థానికులు 108 అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.