వినాయక చవితి సందర్బంగా నెల్లూరు జిల్లా,కలువాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు ఎస్సై కోటయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..ఈనెల 27వ తేదీ నుండి జరిగే వినాయక చవితి ఉత్సవాలకు గణేష్ ఉత్సావ్ యాప్ లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని.. అనుమతులు లేని మండపాలపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.. రోడ్లకు అడ్డంగా మండపాలు వేయకూడదని, వివాదం లేని స్థలాలలో మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, విధ్యుత్ శాఖ వారి దగ్గర కూడా అనుమతులు తీసుకోవాలని సూచించారు..