కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తక్షణమే ఉప్పాడను సముద్ర కోత నుంచి రక్షించేందుకు గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇది జరగని పక్షంలో తాము నిరాహారదీక్ష చేస్తామన్నారు. అందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. ఈ ఆందోళనలో స్థానిక మత్స్యకారులు పాల్గొన్నారు.