మామిడికుదురు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో శుక్రవారం నాటికి వాయిదా పడింది. సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమావేశం నుంచి బాయ్ కట్ చేశారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. అనంతరం నగరం ఏఎంసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పెనుమాల లక్ష్మిని ఘనంగా సత్కరించారు