నల్లగొండ జిల్లా: వినాయక నిమజ్జనం సందర్భంగా నల్లగొండలో శోభయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం హాలియా దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు జయం గౌడ్ ఎక్స్ రోడ్ ఈదుగా మునుగోడు బైపాస్ ఐటీ హబ్ మీదుగా వెళ్లాలని సూచించారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు తిప్పర్తి నార్కట్పల్లి మీదుగా మళ్లిస్తారని తెలిపారు. ప్రజలు సహకరించాలని ఎస్పి శరత్ చంద్ర పవర్ తెలిపారు.