స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన సిఎం గౌరవవందన పెరేడ్ లో రాయదుర్గం కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్ది పాల్గొని ప్రశంస పత్రం అందుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఆ పెరేడ్ లో పాల్గొనే అవకాశం కెటిఎస్ కళాశాలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఎన్సిసి క్యాడేట్ దొర నందిని కి మాత్రమే దక్కింది. గురువారం సాయంత్రం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎన్సిసి సీటీవో బాల నరసింహులు, జక్కల కిరణ్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలతో ముంచెత్తారు.