బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. కరీంనగర్ - రాయపట్నం రాష్ట్ర రహదారిపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. సుమారు అరగంట పాటు రోడ్డు పై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. అయిన వినకపోవడంతో బలవంతంగా అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేయడంతో, పోలీసులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నందిమేడారం సింగిల్ విండో చైర్మెన్ బలరాం రెడ్డి ముక్కపై చిన్న గాయం అయింది.