తిమ్మాపూర్ లో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీ... దొంగలు రెచ్చిపోతున్నారు.పోలీసులు ఎంత గస్తీ నిర్వహించినప్పటికి దొంగలు వారి పని వారు చేస్తున్నారు.తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ గా చేసుకుంటా దొంగతనానికి పాల్పడుతున్నారు.కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో తాళం వేసిన 2 ఇళ్లలో గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో నగదు, వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు SI శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లికి చెందిన లెంకల రామణా రెడ్డి, కరివేద లక్ష్మి తమ ఇళ్లకు తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లారు. దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని పోలీసులు వివరించారు