ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే బ్యాంకు నుండి పోలీస్ శాఖకు, ఫైరింగ్ శాఖకు సిగ్నల్ వెళ్లడంతో అప్రమత్తమయ్యారు. దీంతో రెండు లక్షల విలువ చేసే నెట్వర్క్ రూటర్ కాలి బూడిదైంది. సైరన్ రాకుండా ఉంటే భారీ నష్టం జరిగేదని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. మంటలు ఆర్పడంతో ఒక్కసారిగా బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.