పంతొమ్మిది నెలల కాలంలో సంక్షేమం, అభివృద్ధి లో కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తుంది కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గంలో చేబట్ఠిన జనహీత పాదయాత్ర సూపర్ సక్సెస్ అయ్యిందని సహకరించిన ప్రతి ఒక్కరికీ దన్యవాదలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకి అవసరమైనా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రుణమాఫి చేసాం. వ్యవసాయానికి లక్ష రెండు వేల కొట్ల నిధులు ఖర్చు చేసాం. కనివిని ఎరుగని విధంగా వేలాదిమంది తరలివచ్చి పనిచేసే ప్రభుత్వం కి అండగా ఉంటామని మద్దతు తెలిపారు.