రాయదుర్గం పట్టణంలో తప్పిపోయిన బాలుడు సోషల్ మీడియా సహాయంతో క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరాడు. కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గం ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలిసి పట్టణంలోని JRS కాలనీ లోని బందువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆడుకుంటూ బాలుడు తప్పిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో రాత్రి 7.40 కు గుగ్గిరహట్టి ఏరియా వద్ద దొరకడంతో తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.