కడప జిల్లా రాజంపేట నియోజక వర్గం టిడిపి ఇన్చార్జిగా చమర్తి జగన్మోహన్ రాజు ను చంద్రబాబు నాయుడు నియ మించడంతో శుక్రవారం జగన్మోహన్ రాజు తొలిసారిగా రాజంపేట నియోజక వర్గానికి వస్తున్న సందర్భంగా ఆయనకు సిద్ధవటం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో చమర్తి జగన్మోహన్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రత్యేకంగా మహిళలు హారతులు ఇచ్చరు. పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.ఆయనతో పాటు నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో రాజంపేటకు బయలుదేరారు.