సనాతన ధర్మం కోసం పోరాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను గాజువాక శ్రీకృష్ణదేవ రాయ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన గాజువాక సమన్వయకర్త డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి విచ్చేసి పుట్టినరోజు కేకులు కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ రక్తాన్ని దానమిచ్చారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ అభివృద్ధి పథంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మనందరం రుణపడి ఉంటామన్నారు.