షాద్నగర్ నియోజకవర్గం రావిచేడు గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం మధ్యాహ్నం పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ మహిళలోకానికి స్ఫూర్తి అని అన్నారు. బడుగు వర్గాల ఉన్నతికి ఆమె ఎంతో కృషి చేశారని చాకలి అయిలమ్మ త్యాగాలు మరువలేనివని అన్నారు. త్యాగనిరతికి కులాలు మతాలతో సంబంధం ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.