ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకులను దర్శి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైసిపి పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.