కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన 70 కుటుంబాలు మాచారెడ్డి చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అక్కపూర్ గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 22/1A లోగల భూములు గత 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేయడం జరిగిందని అన్నారు.50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని ఉన్నారు.