నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., వారు జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా, విశాఖ మహా నగరంలో భిక్షాటన చేస్తున్న 243 యాచకులను రేస్క్యు చేసి, వారికి నగరంలో పలు ఆశ్రమాలలో ఆశ్రయం కల్పించిన విషయం విధితమే.243 మంది యాచకులలో వారి బంధువులకు, ఆశ్రయాల నిర్వాహకులకు అప్పగించగా మిగిలి ఉన్న 128 మంది యాచకులకు ఈ రోజు నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు నగర పోలీసులు యాచకుల వేలిముద్రల ఆధారంగా బంధువులతో కలిపెందుకు వివరాలు సేకరించారు.