సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు, దహేగం మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో తుది ఓటర్ జాబితాను బెజ్జూరు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, దాహేగం ఎంపీఓ రవి విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంతో పాటు ప్రతి గ్రామపంచాయతీ లోను తుది ఓటర్ జాబితా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు,