గుడివాడ బస్టాండ్ సెంటర్లో వాహన తనిఖీలు: ట్రాఫిక్ ఏఎస్ఐ స్తానిక గుడివాడ బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఏఎస్ఐ శంకర్రావు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలను పరిశీలించి, పెండింగ్లో ఉన్న చలానాలపై చర్యలు తీసుకున్నారు. రోడ్డు భద్రత కోసం వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ దరించాలని, మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని సూచించారు. అలాగె ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.