శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో లేబర్ అడ్డా వద్ద వనపర్తి జిల్లా లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇశ్రామ్ కార్డులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికుల కు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇ శ్రమ్ పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకొని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.