కర్నూలు మార్కెట్ యార్డును జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య సందర్శించి వచ్చిన ఉల్లిగడ్డలను పరిశీలించి కిలో 12 రూపాయలు (క్వింటాలకు రూ1200 )చొప్పున మార్క్ఫెడ్ కొంటుందని రైతులకు తెలియజేశారు. ఆదివారం రాత్రి 7 గంటలకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి .నవ్య కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ వచ్చిన ఉల్లిగడ్డలను పరిశీలించారు మారెళ్ళ గ్రామం,పెండేకల్లు రెవిన్యూ గ్రామం చెందిన రంగస్వామి 240 సంచులు, సంచి 50 కేజీల చొప్పున తీసుకుని వచ్చారు.అలాగే గూడూరు కి చెందిన నాగరాజు 150 సంచులు 50 కేజీల చొప్పున మార్కెట్ యార్డులో అమ్మకానికి పెట్టారు.