కర్నూలు నగర పరిధిలో ఎన్‌హెచ్ 340సి జాతీయ రహదారి విస్తరణలో స్థలం కోల్పోయే బాధితులకు ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టిడిఆర్) బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో స్థలం కోల్పోతున్న ముగ్గురు బాధితులకు టిడిఆర్ బాండ్లను అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… శ్రీ దామోదరం సంజీవయ్య సర్కిల్ నుండి ఎస్.ఎస్. గార్డెన్స్ వరకు ఎన్‌హెచ్ 340సి జాతీయ రహదారిని 100 అడుగులుగా వెడల్పు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మొత్తం 2.34 కి.మీ పొడవున ఈ విస్తరణలో 201 ఆస్తులు ప్రభావితమవగా, 178 ఆస్తులు