క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు. సంగారెడ్డిలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా హాకీ పోటీలను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలను జీవితంలో ఒక పార్ట్ గా చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అన్ని పాఠశాలలో క్రీడలపై ఆసక్తిని పెంచే విధంగా పిఈటిలు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ మైదానాన్ని ఎంపీ గారి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. పాఠశాలలో అన్ని సబ్జెక్టుల మాదిరిగా క్రీడలకు కూడా సమయాన్ని కేటాయించాలన్నారు.