తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడులో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో సహకార సంఘం ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా తీరును తిరువూరు ఆర్డీవో కే మాధురి స్వయంగా పరిశీలించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.