నాగలాపురం పోలీస్ స్టేషన్లో చవితి వేడుకలు నాగలాపురం పోలీస్ స్టేషన్లో బుధవారం వినాయక ప్రతిమను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని సుందరంగా అలంకరించారు. ఎస్ఐ సునీల్, ట్రైనీ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి నైవేద్యం సమర్పించి, కర్పూర హారతులు అందించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రసాదాలు పంపిణీ చేశారు.