Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ చిట్యాల మండలం అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు చిట్యాల పాత బస్టాండ్ లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ఆదివారం మద్యాహ్నo 2గంటలకు దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇంతకుముందు కూడా ఇదే మాదిరిగా ఇష్టానుసారంగా అపరిపక్వంగా మాట్లాడితే సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా మందలించడంతోపాటు క్షమాపణ చెప్పాలని కోరడం జరిగిందన్నారు.