ఏటూరునాగారంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమస్యల వలయంగా మారింది. పాఠశాలలోని వేడి నీటి గ్రీజర్లు, వాటర్ ట్యాంకులు, నల్లాలు మరమ్మతుకు వచ్చాయి. గత కొంతకాలంగా విద్యార్థులు చలి నీటితో స్నానాలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రీజర్లు పగిలి అందులో నుంచి నీరు వృధాగా పోతుంది వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.