సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ నిజాంపేట్ మండల కేంద్రంలో శనివారం బిజెపి నాయకులు ఆందోళన చేశారు. ఇటీవల కురిసిన అతివృష్టి వర్షాల వల్ల రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ నాగజ్యోతికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.