రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రూరల్ పరిధిలోని ఫాజుల్ నగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల కోసం నీటిని విడుదల చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు రైతులతో పాటు కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.