షాద్ నగర్ మున్సిపల్ పరిధి చౌడమ్మ గుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారు. చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా సంవత్సరంలో ఒకమారు ఇలాంటి అవకాశం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారికి సింధూరాన్ని తొలగించి భక్తులకు నిజ రూప దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారని వివరించారు.