దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ లో పలు కాలనీలోని దుర్గామాత, శారదా దేవి మండపాల వద్ద ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ద్వారక నగర్ లోనీ దుర్గమాత పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు తిలకించారు.