కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహుదూర్ పల్లి టెక్ మహేంద్ర యూనివర్సిటీ ముందు గురువారం ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. యూనివర్సిటీలో ఏదేచ్ఛగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని, యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల తనిఖీల్లో యూనివర్సిటీ అలసత్వం బయటపడిందని, ఇది డ్రగ్స్ హబ్ గా మారిందని వారు అన్నారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.