సుగాలి ప్రీతి హత్య విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించటం లేదని జై భీమ్ రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు అధికారం లేనప్పుడు ఊగిపోయాడని, అధికారం చేతికి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి హత్య విషయాన్ని తొంగలో తొక్కడని మండిపడ్డారు. మాటలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఎప్పుడు పరిపాలన అందిస్తారని విమర్శించారు.