తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్తో కాగజ్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ హైకోర్టు గ్రూపు వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాలలో అక్రమాలు అవకతవకలు జరిగాయని తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ కాగజ్నగర్ మండల కన్వీనర్ పార్వతి అంజన్న డిమాండ్ చేశారు. ఫలితాలలో అక్రమాలు జరిగాయని కోర్టు తీర్పునివ్వడంతో టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు,