పానిక్ భయంతోనే యూరియాకు డిమాండ్: జిల్లా కలెక్టర్ కృష్ణ జిల్లా లో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరెట్ లొని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డికె బాలాజి మిడియా సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగానే జిల్లాకు యూరియా వచ్చిందన్నారు. అయితే కొంత మంది రైతులు రబీలో యూరియా దొరకదేమోఅన్న అపోహతో ఉన్నారని, ఫలితంగా యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. అలాగే కొంత మంది నాన్ అగ్రికల్చర్ పర్పస్ కు యూరియాను మళ్లిస్తున్నట్టు తమదృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కూడా నిఘా పెట్టామన్నారు.