పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు ఈవీఎంలు షాద్ నగర్కు చేరుకున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు, మండల రెవెన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పట్టణ కేంద్రంలో ఇండోర్ స్టేడియంలో 328 బ్యాలెట్ ఈవీఎంలు, 368 వీవీ ప్యాట్లు భద్రపరిచారు. పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణ కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశామన్నారు.