గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సభ తర్వాత రేపటి నుంచి నేను అసెంబ్లీకి రానని తెలిపారు. ఇప్పుడు ఉండాల్సింది అసెంబ్లీలో కాదని ప్రజలలో అని వరదల సమయమని ప్రజల కష్టాలు తీర్చడమే నా లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.