తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రమాణస్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏ ఏం సి చైర్మన్ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ నెల 7 వ తేదీ సాయంత్రం స్థానిక SKS