అనంతపురం నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ డిఈఓ ప్రసాద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని కొనియాడారు. ఉత్తమ సమాజం తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని తెలిపారు.