Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పండుగ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి