కామారెడ్డి జిల్లాలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి జబ్బర్ అన్నారు. మంగళవారం కామారెడ్డిలొ ఆయన మాట్లాడారు. గుజరాత్ మార్వాడీల వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. ప్రతి వ్యాపారంలో వారు రావడం వల్ల స్థానికంగా ఉన్న వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా వారు వ్యాపారాలు చేసుకోవాలన్నారు.