ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని దాబా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం దాబా గ్రామ సమీపంలోని చీకిలీవాగు నీటి కుంటలో అదే గ్రామానికి చెందిన మొహార్లే నిర్ముల (33). మొహార్లే గణేష్ (12). వాడై మహెశ్వరి (10). అదే శశికళ (8)దుర్మరణం చెందారు. గ్రామ శివారులోని చికిలీవాగు నీటికుంటలో యూరియా బస్తాలు కడుగుతుండగా. ఓ ఖాళీ బస్తా నీటిలో కొట్టుకుపోయింది. ఆ బస్తాను తెచ్చేందుకు నిర్మలా కొడుకు గణేష్ నీటిగుంటలో దిగగా నీటి లోతు ప్రవాహం అధికం ఉండటంలో గల్లంతైయ్యాడు. గమనించి తల్లి నిర్ముల కాపాడేందుకు వెళ్లగా..ఆమె వెంట మరో ఇద్దరు శశికళ. మహేశ్వరి నీటిలో పడి గల్లంతయ్యారు.