రేగిడి ఆముదాలవలస మండల గ్రామ శివారులోని నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ శ్రీధర్ శుక్రవారం ఉదయం 7 గంటలకు తెలిపారు. ట్రాక్టర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పమని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.