కోవెలకుంట్లలో ఎస్సై మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, మహిళలు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సూచించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ఆటో డ్రైవర్లు సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు.