మెడికల్ షాప్ యజమానులు అందరూ కూడా వ్యాపార దృష్ట్యా కాకుండా సమాజంపైన భాద్యతగా ఉండాలని నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు కోరారు. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని తేజస్విని హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న ఆధ్వర్యంలో నార్కోటిక్ డ్రగ్స్ మరియు యాంటీబయోటిక్స్ వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడ 2.0 రైడ్ లో నంద్యాల జిల్లాలో ఒక్క కేసు కూడా నందు కాకుండా చేసి నంద్యాల జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు.